Notification texts go here Contact Us Buy Now!

అన్నదాతలకు లయన్స్ చేయూత - ఉచితంగా వ్యవసాయ స్ప్రేయర్ల పంపిణీ

అన్నదాతలకు లయన్స్ చేయూత.. ఉచితంగా వ్యవసాయ స్ప్రేయర్ల పంపిణీ!

  • ఏరియా లీడర్ ఆవుల గోపాల్ రావు.

Lions Club Leaders Avula Gopal Rao Distributing Free Agricultural Sprayers To Farmers In Uduthagudem

వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్ :

ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలో అగ్రగామిగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, రెండు జిల్లాల 320ఎఫ్, 320సి ఆధ్వర్యంలో స్థానిక మ్యాంగో రిసార్ట్స్, ఉడుతగూడెం నందు వ్యవసాయదారులకు ఉపయుక్తమైన అత్యాధునిక స్ప్రేయర్ల ఉచిత పంపిణీ మెగా సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

ముఖ్య అతిథి గ్యాట్ ఏరియా లీడర్ ఆవుల గోపాల్ రావు మాట్లాడుతూ...  "లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అంటే కేవలం కంటి వైద్య శిబిరాలు, అన్నదానాలు, రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజంలో ఏ వర్గానికి ఏ అవసరం ఉందో గుర్తించి సేవలందిస్తుందని, దేశానికి వెన్నెముక వంటి రైతన్న ప్రస్తుత రోజుల్లో తీవ్రమైన పెట్టుబడి వ్యయాలు, పరికరాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. పంట ఎదుగుదల దశలో సకాలంలో పురుగుమందులు, పోషకాలు పిచికారీ చేయడానికి నాణ్యమైన స్ప్రేయర్లు లేక ఇబ్బంది పడుతున్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పరికరాలు ఎంతో ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తాయి" అని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వినూత్న మెగా సేవా కార్యక్రమము  నిర్వహించిన రెండు జిల్లాల గవర్నర్ లను, క్లబ్ భాద్యులను అభినందించారు.

అన్ని వర్గాల అవసరాలను గుర్తించడమే లయన్స్ క్లబ్ ధ్యేయం

ఈ సమావేశ నిర్వాహకులు రెండు జిల్లాల గవర్నర్ లు నరహరి సుధాకర్ రెడ్డి, కళ్లెం కృష్ణా రెడ్డి మాట్లాడుతు ఈ సంవత్సరం ట్విన్ ఇన్ ప్రోగ్రామ్ లో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఒక మెగా సేవా కార్యక్రమం ముఖ్యంగా రైతులకు అందించడం చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమంలు మరిన్ని చేసే విధంగా మా క్లబ్స్ నుండి కృషి చేపిస్తామని తెలిపారు.

విశిష్ఠ అతిధి, వ్యవసాయ శాస్త్రవేత్త ఆర్ ఉమా రెడ్డి మాట్లాడుతూ... ఆధునిక వ్యవసాయంలో సరైన సమయంలో పంట సంరక్షణ చర్యలు చేపట్టడం ఎంత కీలకమో, నాణ్యమైన పరికరాలను ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం ఆని, చాలామంది రైతులు నాసిరకం స్ప్రేయర్లు, అరిగిపోయిన నాజిళ్లు వాడటం వల్ల మందులు సమానంగా పడక మందు ఖర్చు పెరగడంతో పాటు పురుగులు, తెగుళ్లు సమర్థవంతంగా అదుపులోకి రావని, రైతుల క్షేత్రస్థాయి అవసరాలను గుర్తించి, శాస్త్రీయ పద్ధతుల్లో ఉపకరించే పరికరాలను ఉచితంగా అందించిన లయన్స్ క్లబ్ నిర్వాహకుల ఆలోచన ఎంతో అభినందనీయమని అన్నారు.

రైతుల కృతజ్ఞతలు...

​ఈ సందర్భంగా లబ్ధిపొందిన రైతులు మాట్లాడుతూ, పంట కీలక దశలో ఉన్న సమయంలో ఖరీదైన స్ప్రేయర్లను ఉచితంగా అందజేసి లయన్స్ క్లబ్స్ తమను ఆదుకుందని హర్షం వ్యక్తం చేస్తూ, రెండు జిల్లా ల క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సేవా కార్యక్రమం

లో మల్టీపుల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డా చంద్రశేఖర్ ఆర్య, కోశాధికారి కె. ఇన్నా రెడ్డి,  320ఎఫ్, 320సి రెండు జిల్లాల ఉప జిల్లా గవర్నర్ లు రేవూరి రమణా రెడ్డి,  డా. సురేష్‌కుమార్ మంద, గుంటుక శేఖర్‌రెడ్డి మల్టీపుల్ జి ఎస్ టి కోఆర్డినేటర్ తీగల మోహన్‌రావు, ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ కటంగూరు హరీష్ రెడ్డి, మల్టీపుల్ ట్విన్నింగ్ సర్వీస్ ఆక్టివిటీస్ చైర్మన్ గాందాని శ్రీనివాస్, పూర్వ జిల్లా గవర్నర్లు సి వెంకట్ నారాయణ్ రెడ్డి, తమ్మెర లష్మినరసింహ రావు , పి. సూర్యనారాయణ,  డా. కృష్ణ ప్రసాద్, రెండు జిల్లాల క్యాబినెట్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నట్లు లయన్స్ 320ఎఫ్ జిల్లా కమ్యూనికేటర్ కటంగూరు రాంగోపాల్ రెడ్డి తెలిపారు.


Tags : Lions Club Mega Service 2026, Free Agricultural Sprayers Distribution, Udutha gudem Mango Resorts Event, Newspage Agriculture News




Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.
NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...